యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటించిన తాజా సినిమా మిరాయ్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా పూర్తిగా అడ్వెంచర్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్ల వద్ద మంచి రద్దీ కనిపిస్తోంది. ప్రేక్షకులు ఉత్సాహంగా సినిమా చూడటానికి వెళ్తున్నారు.
అయితే సినిమాకు సంబంధించిన ఒక అంశం అభిమానులను కొంచెం నిరాశపరిచింది. ప్రమోషన్లలో రిలీజ్ చేసిన వైబ్ ఉంది అనే పాట సినిమాల్లో ఎక్కడా కనిపించలేదు. అలాగే నిధి అగర్వాల్‌తో చేసిన మరో సాంగ్ కూడా తెరపై లేకపోవడం గమనార్హం. చిత్ర బృందం ఈ పాటలు థియేటర్ వెర్షన్‌లో తొలగించారని, కథ నడకకు అవి సరిగా సరిపోకపోవడంతో ఎడిటింగ్ సమయంలో తీసేశారని చెబుతున్నారు.
ఇక సినిమా మొత్తం చూస్తే రెండు మూడు సాంగ్స్ మాత్రమే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ రూపంలో వినిపిస్తాయి. మిగతా పాటలు లేవు. అయితే తొలగించిన ఆ పాటలను తరువాత ఓటీటీ వెర్షన్‌లో జతచేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.