అభిమానులు ఎక్కడుంటారంటే!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం “విశ్వంభర”. యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ భారీ సినిమా చేస్తున్న సమయంలోనే మెగాస్టార్ కి పలు అరుదైన గౌరవాలు దక్కాయి. మొదటిగా అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు చిరుని వరించింది. మొన్ననే గిన్నిస్ వరల్డ్ రికార్డుని కూడా మెగాస్టార్ కైవసం చేసుకొని టాలీవుడ్ ఇండియన్ సినిమా దగ్గర హిస్టరీ క్రియేట్ చేశారు.

ఇక ఇదిలా ఉండగా రీసెంట్ గా జరిగిన ఐఫా అవార్డ్స్ లో కూడా మెగాస్టార్ అవుట్ స్టాండింగ్ అఛీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అంటూ మరో స్పెషల్ అవార్డుని అందుకున్నారు. ఇలా తన కెరీర్ లో ఎన్నో అవార్డులు గెలుచుకున్న చిరు ఆ అవార్డు వేడుకలో చేసిన కామెంట్స్ మెగా అభిమానులని ఎంతో  ఆనందాన్ని కలిగించాయి.

తనకి తన అభిమానులని మించిన అవార్డు ఇంకొకటి లేదని వారి తర్వాతే మిగతా అవార్డులు అనే రీతిలో తన అభిమానులకి తన గుండెల్లో ఎలాంటి స్థానం ఉందో తెలియజేశారు. దీంతో చిరు విషయంలో అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories