పెళ్లేప్పుడంటే!

సీనియర్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, యంగ్ డైరెక్టర్‌  వశిష్ట కాంబోలో వస్తున్న ‘విశ్వంభర’ మూవీలో యాక్ట్‌ చేస్తుంది. అయితే, గత కొంతకాలంగా త్రిష పెళ్లి పై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరోవైపు 41 ఏళ్లు దాటిపోతున్నా త్రిష ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. తాజాగా త్రిష తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. కమల్ హాసన్ తో థగ్ లైఫ్‌ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్లలో త్రిష తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘నాకు పెళ్లి మీద పెద్దగా నమ్మకం లేదు. అందుకే దానికి దూరంగా ఉంటున్నాను. నాకు పెళ్లి కావట్లేదనే బాధ అస్సలు లేదు’ అంటూ త్రిష చెప్పుకొచ్చింది.

త్రిష ఇంకా మాట్లాడుతూ.. ‘నా కెరీర్, సినిమాలు, ఫ్యామిలీ మీదనే దృష్టి పెడుతున్నాను. ఒకవేళ నాకు పెళ్లి కావాలని ఉండి అది జరిగితే ఓకే. ఒకవేళ కాకపోయినా ఓకే. నేను దాని గురించి ఎన్నడూ ఆలోచించలేదు. బహుషా పెళ్లి, పిల్లలు నాకు వర్కౌట్ కావేమో అనిపిస్తుంది’ అంటూ త్రిష క్రేజీ కామెంట్స్ చేసింది. దీంతో, అసలు త్రిష ఏం చెబుతోంది ?, ఓ వ్యక్తితో ఆమె గతంలో ఎంగేజ్మెంట్ చేసుకుంది కదా.. ఇంతలోనే ఇలా ఎందుకు మాట్లాడుతుంది అంటూ అభిమానులు డౌట్ పడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories