అథర్వా మురళీకి క్రైమ్, థ్రిల్లర్ కథలు ఎంతగానో సెట్ అవుతాయి. ఈసారి కూడా ఆయన అదే జానర్లో ఓ కొత్త సినిమా చేశారు. ‘టన్నెల్’ అనే పేరుతో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను రవీంద్ర మాధవ డైరెక్ట్ చేశారు. ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించగా, అశ్విన్ కాకుమాను విలన్‌గా కనిపించబోతున్నారు. సెప్టెంబర్ 12న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగు ప్రేక్షకుల కోసం ఎ.రాజు నాయక్ లచ్చురామ్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను అందిస్తున్నారు.
ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. హీరో చెప్పే డైలాగ్స్ చూస్తే సినిమా మొత్తం ఎంత ఇన్టెన్స్గా ఉండబోతుందో అర్థమవుతుంది. ఇందులో యాక్షన్ సన్నివేశాలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో, అంతే స్థాయిలో లవ్ ట్రాక్‌కి కూడా స్పేస్ ఇచ్చారు. అథర్వా, లావణ్య జోడీ ఫ్రెష్‌గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అనిపిస్తోంది. ట్రైలర్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌లు స్టైలిష్‌గా కట్ చేయబడటంతో అంచనాలు ఇంకా పెరిగాయి.