టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ఉన్న హీరోల్లో అల్లరి నరేష్ పేరు ముందుంటుంది. కామెడీ రోల్స్‌తోనే కాకుండా సీరియస్‌గా నటనకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రల్లోనూ ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘ఆల్కహాల్’ అని పేరుతో వస్తోంది. ఈ సినిమాను మెహర్ తేజ దర్శకత్వం వహించారు.
తాజాగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్‌ను విడుదల చేసి రేపు సెప్టెంబర్ 4న టీజర్ రాబోతుందంటూ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమా టీజర్ పైన కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. కొత్త పోస్టర్‌ని చూసిన వారు టీజర్ కూడా అదే స్థాయిలో ఎంగేజింగ్‌గా ఉంటుందేమో అని ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం చైతన్ భరద్వాజ్ అందిస్తుండగా, నిర్మాణ బాధ్యతలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కలిసి చేపట్టాయి.