ఓజీ తరువాత సాంగ్‌ వచ్చేది ఎప్పుడంటే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ఓజిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. వీరిద్దరి మధ్య సాగే అందమైన మెలోడీ సాంగ్‌ను రెండో సింగిల్‌గా త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం తాజాగా వెల్లడించింది.

ఇక ఈ పాట విడుదల తేదీపై కూడా కొత్త అప్డేట్ బయటకొచ్చింది. వినాయక చవితి సందర్భాన్ని ప్రత్యేకంగా మార్చేందుకు ఆగస్టు 27న ఈ మెలోడీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది.

సంగీతాన్ని థమన్ అందిస్తుండగా, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. అన్ని పనులు పూర్తయ్యాక సినిమా సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories