వార్‌ 2 ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేది ఎప్పుడంటే!

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “వార్ 2”పై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి. మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకూ మేకర్స్ ఈ సినిమా నుంచి ఏ పాటనైనా విడుదల చేయలేదు. అయితే ఇప్పుడు ఫైనల్‌గా ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది.

ఈ సినిమాలో హృతిక్‌తో కియారా అద్వానీ జోడీగా నటిస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే ఓ రొమాంటిక్ పాటను ఫస్ట్ సింగిల్‌గా రిలీజ్ చేయబోతున్నారు. అందులోనూ కియారా పుట్టినరోజైన జూలై 31ను ఈ పాట విడుదలకు ప్రత్యేకంగా ఎంచుకున్నారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు.

ఈ పాటకు సంగీతం అందించిన ప్రీతమ్ ఆల్రెడీ కొన్ని పాన్ ఇండియా హిట్స్ అందించిన అనుభవం ఉన్న సంగీత దర్శకుడు కావడంతో, పాటపై అంచనాలు పెరిగాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సాంకేతికంగా, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా హై స్టాండర్డ్స్‌లో రూపొందుతోంది. ఫస్ట్ సాంగ్‌తో స్టైలిష్ రొమాన్స్ టచ్ ఇస్తూ మ్యూజికల్ ప్రమోషన్‌కు స్టార్ట్ చెప్పనుంది వార్ 2 టీమ్.

ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఈ పాట మరింత హైప్‌ను తీసుకురావడంలో కీలకపాత్ర పోషించనుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories