నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా థియేటర్లలో ఎంతగానో హిట్ అయ్యింది. ఇప్పుడు అదే సినిమా బుల్లితెరపై రాబోతుందంటే అభిమానుల్లో ఎగితం కనిపిస్తోంది. భారీ యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగులతో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య ఎనర్జీ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
డైరెక్టర్ బాబీ స్టైల్‌కు తగ్గట్టుగా ఫుల్ మాస్ మసాలా ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రూపొందింది. థమన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ హైలైట్ అయ్యింది. ప్రతి సీన్‌కి బిగ్ స్కోర్ అందిస్తూ థమన్ తన మార్క్‌ను మరోసారి చూపించాడు. థియేటర్లో ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్ ఇప్పుడు టీవీలో ఈ సినిమాను మళ్లీ చూసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ చిత్రాన్ని స్టార్ మా ఛానల్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా జూలై 13న సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయబోతున్నట్లు ప్రకటించింది. దీంతో బుల్లితెరపై డాకు మహారాజ్ సందడి ఎలా ఉంటుందా అన్న ఆసక్తి అందరిలో ఉంది.
ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ కనిపించగా, ఊర్వశి రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్, బాబీ డియోల్ లాంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. ఫార్చున్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మించాయి.
థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ మాస్ ఎంటర్టైనర్ టీవీ స్క్రీన్‌పైనా అదరగొట్టేనా అనేది చూడాల్సిందే.