తాజాగా టాలీవుడ్ నుంచి వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో యంగ్ హీరోలు నార్నె నితిన్, సంగీత్ శోభన్ అలాగే రామ్ నితిన్ లు హీరోలుగా దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “మ్యాడ్ స్క్వేర్” మూవీ ఒకటి. మరి ఈ చిత్రం ఎన్నో అంచనాలు నడుమ వచ్చి థియేటర్స్ లో అంతే రేంజ్ వసూళ్లు అందుకుని అదరగొట్టింది. ఇక ఈ చిత్రం థియేటర్స్ లో దాదాపు రన్ ని కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఇక ప్రస్తుతం ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కి సిద్దమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో ఈ చిత్రం ఈ ఏప్రిల్ 25 నుంచే అలరించేందుకు వచ్చేస్తుంది అని తెలుస్తుంది. అయితే పాన్ ఇండియా భాషల్లో కాకుండా కేవలం తెలుగులోనే ఈ చిత్రం రానున్నట్టుగా టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.