బన్నీ త్రివిక్రమ్ సినిమా విడుదల ఎప్పుడంటే! ‘అల్లు అర్జున్’ బాక్సాఫీస్ దగ్గర కూడా తాను ఐకాన్ స్టారే అని ‘ ‘పుష్ప 2 ది రూల్’తో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా కలెక్షన్స్ నుఅందుకుంటుంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు బన్నీ తర్వాత చేయబోయే సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన కొత్త ప్రాజెక్ట్ ను ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు విడుదల కాబోతుంది అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బన్నీ – త్రివిక్రమ్’ సినిమాకి సంబంధించి నిర్మాత నాగవంశీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఫినిష్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలో బన్నీ కూడా త్రివిక్రమ్ తో కూర్చుంటారని.. పాత్ర గెటప్ అండ్ సెటప్ విషయంలో చర్చ జరుపుతారని.. ఇక షూటింగ్ ను 2025 మిడ్ లో మొదలు పెట్టి.. 2026 ఎండింగ్ లో సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేసినట్లు నాగవంశీ తెలిపారు. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, మరియు అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత , అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబో మరోసారి జత కడుతున్నారు. హారిక & హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మించనున్నాయి.