ఆంధ్రప్రదేశ్లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇది ఒక దుర్ధినం. జగన్ చెబుతున్న ప్రతి మాట నిజమే నేను నమ్ముతూ వచ్చిన వారికి ఇది ఒక షాక్. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిగా తెలుగుదేశం జనసేన లతో కలిసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తుండగా.. వారి మైత్రి బంధం లో లుకలుకలు ఏర్పడ్డాయని ప్రచారం చేస్తూ వచ్చిన వారికి ఇదొక పెద్ద చెంపపెట్టు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంలో పొత్తుల్లో ఉన్నప్పటికీ కూడా.. వైయస్సార్ కాంగ్రెస్ తో స్నేహ బంధాన్ని కోరుకుంటున్నది అని జగన్మోహన్ రెడ్డి సంకేతాలు ఇస్తూ వచ్చారు. తద్వారా కూటమి ఐక్యత పట్ల ప్రజల్లో అనుమానాలు రేకెత్తడానికి ఆయన కుట్ర రచన చేశారు. ఇలాంటివన్నీ కూడా ధర్మవరంలో ఒక్క అమిత్ షా ప్రసంగంతో దూది పింజలు లాగా తేలిపోయాయి. నేరుగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కేంద్ర హోం మంత్రి ధర్మవరంలో నిప్పులు జరిగే ప్రసంగం చేశారు.
ఒకవైపు అనకాపల్లిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ మీద వైసిపి గుండాలు దాడికి తెగబడిన నేపథ్యంలో రాష్ట్రంలో కేంద్ర హోం మంత్రి పర్యటన ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. దానికి తగ్గట్లుగానే ఆయన ధర్మవరం సభలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుండాగిరిని అంతం చేయడానికి, భూ మాఫియాను తుదముట్టించడానికి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన లతో కలిసి పోటీ చేస్తున్నదని ప్రకటించారు. ఈ మాటలు జగన్ చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని నమ్మే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఒక పట్టాన మింగుడు పడకపోవచ్చు.
తెలుగుదేశంతో పొత్తు ఉండవచ్చు గాని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తే.. ఎప్పటిలాగా భారతీయ జనతా పార్టీ తమతో స్నేహంగానే ఉంటుందని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇన్నాళ్లు కలలు కంటూ వచ్చారు. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మాటలు కూడా వారికి అలాంటి అభిప్రాయాన్ని కలిగించాయి. తెలుగుదేశంతో పొత్తు బలవంతంగా కుదిరినది అని అనుకుంటూ వచ్చారు. కానీ తాజాగా ధర్మవరం సభలో కేంద్ర హోం మంత్రి మాట్లాడిన తీరును గమనిస్తే వారి కలలు మొత్తం చెదిరిపోయాయి. భారతీయ జనతా పార్టీ పగబట్టిన ప్రత్యర్ధుల మీద ఏ రకంగా మాట్లాడుతూ వస్తున్నదా జగన్మోహన్ రెడ్డి గురించి అమిత్ షా మాటలు కూడా అదే విధంగా ఉన్నాయని వారు భయపడుతున్నారు.
అమరావతి రాజధాని కి కట్టుబడి ఉన్నామని, అందుకోసమే మూడు పార్టీలు మళ్లీ జతకట్టామని చెప్పిన మాటలను కూడా వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
కేంద్రంలో ప్రధాని మోడీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తిరిగే అధికారంలోకి వస్తే రెండు సంవత్సరాలలోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని అమిత్ షా చెప్పిన మాటలు వైసీపీ దళాలకు షాక్ అనే అనాలి. తిరుమల పవిత్రతకు తెలుగు భాషకు జగన్ ద్రోహం చేస్తున్నారని అర్థం వచ్చేలా అమిత్ షా స్పందించిన తీరును కూడా వారు జీర్ణం చేసుకోవడం లేదు. మొత్తానికి ధర్మవరంలో షా సభతో వైసిపి నాయకుల కలలు మొత్తం కలలైపోయాయని చెప్పాల్సిందే.