కోవర్టులు దొరికే సరికి భూమనకు కంగారు!

మేకల్ని బలి ఇచ్చినారు.. అసలు నిందితుల్ని వదిలేశారు. ఉద్దేశపూర్వకంగానే కంటితుడుపు చర్యగా ఈ చర్యలు తీసుకుంటున్నారని కరుణాకర రెడ్డి పాపం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల మీద బురద చల్లడానికి, భక్తుల్లో అపోహలను వ్యాప్తి చేయించడానికి తనకు కోవర్టులుగా పనిచేస్తున్న అధికారి ప్రమాదంలో పడేసరికి.. భూమన కరుణాకర రెడ్డికి పాపం ఆవేదన తన్నుకొస్తున్నట్టుందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారదర్శనానికి టికెట్లు కేటాయించేందుకు గాను.. తిరుపతిలో ఏర్పాటుచేసిన క్యూలైన్లలో ఈ ఏడాది జనవరి 8వతేదీన తొక్కిసలాట జరిగి 6గురు చనిపోయారు. ఈ వ్యవహారంపై న్యాయవిచారణకు ప్రభుత్వం రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తితో కమిషన్ ఏర్పాటుచేసింది. కూలంకషంగా దర్యాప్తు చేసిన కమిషన్.. ఈ తొక్కిసలాటకు డీఎస్పీ వి.రమణకుమార్, ఆరోజు టీటీడీ తరఫున ఆ కేంద్రానికి ఇన్చార్జిగా ఉన్న గోశాల డైరక్టర్ కె.హరనాధరెడ్డి, టీటీడీ జేఈవో ఐఏఎస్ అధికార గౌతమి బాధ్యులు అని తేల్చింది. అలాగే ఈ తొక్కిసలాటతో అప్పటి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుకు ఎలాంటి సంబంధం లేదని కూడా తేల్చింది. అలాగే బాధ్యులైన ఇద్దరు అధికారులు రమణకుమార్, హరనాధ్ రెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గౌతమి పై చర్యలు తీసుకునే బాధ్యతను జీఏడీకి అప్పగించారు.
అయితే ఇది టీటీడీకి సంబంధించిన వ్యవహారం. ఒక తప్పు జరిగింది. కొందరి పొరబాటు లేదా నిర్లక్ష్యం వల్ల భక్తులు గుమికూడిన చోట తొక్కిసలాట జరిగింది. ఏకంగా ఆరుగురు మరణించడం అనేది చాలా విషాదకరం. ప్రభుత్వం న్యాయవిచారణ చేయించి.. అందుకు బాధ్యులను నిర్ణయించి.. వారి మీద చర్యలకు ఉపక్రమిస్తోంది. ఇందులో ఎవ్వరైనా సరే.. భిన్నంగా స్పందించడానికి ఏం అవకాశం ఉంది. అసలు ఏ చర్యలూ తీసుకోకుండా.. ఈ ఆరు మరణాల విషాదాన్ని అలా గాలికి వదిలేస్తే అంతా హేపీగానే ఉండగలరా.. ప్రభుత్వాన్ని సమర్థించగలరా? లేదు కదా. కానీ.. ప్రభుత్వం ఇలా.. చర్యలు తీసుకుంటుండే సరికి తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డికి ఆవేదన పొంగుకొచ్చింది.
గోశాలకు డైరక్టర్ గా ఉంటూ ఈ ఘటన తర్వాత సస్పెండై, ఇప్పుడు క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి ఉన్న హరనాధరెడ్డి తనకు కోవర్టుగా సహకారం అందిస్తూ ఉండే అధికారి కావడంతో.. భూమన ఇప్పుడు రెచ్చిపోతున్నారు. ఈ ఘటన, హరినాధరెడ్డి సస్పెన్షన్ తర్వాత.. గోశాలలో ఆవులు వందల సంఖ్యలో చనిపోతున్నాయంటూ భూమన ఒక డ్రామా నడిపించారు. నిరాధార ఆరోపణలతో, కొన్ని ఫోటోలు చూపించి.. వందల ఆవులు మరణిస్తున్నట్టు, వాటిని పట్టించుకోవడం లేదన్నట్టు నిందలు వేశారు. అయితే పాత ఫోటోలను భూమనకు చేరవేసి, ఇలాంటి ఆరోపణలకు సహకరించింది ఈ హరనాధరెడ్డే అనే ఆరోపణలున్నాయి. ఆ వివాదం చాలా కాలం నడిచింది. టీటీడీలో ప్రతిచోటా తనకు సమాచారం ఇవ్వగల మనుషులు ఉన్నారని, ఎక్కడ ఏం జరిగినా తాను ఇలాగే ప్రశ్నిస్తుంటానని ఆ సందర్భంలో భూమన కరుణాకర రెడ్డి.. తనకున్న కోవర్ట్ నెట్ వర్క్ గురించి ఘనంగా చెప్పుకున్నారు. ఇప్పుడు ప్రధాన కోవర్టుల్లో ఒకరైన హరనాధరెడ్డిమీద చర్యలు తీసుకుంటుండే సరికి.. భూమన షాక్ కు గురై.. మేకల్ని బలిచేశారని, అసలు నిందితుల్ని వదిలేశారని పసలేని మాటలు మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories