బుల్లితెర పై తమ్ముడు ఎప్పుడంటే..!

నితిన్ హీరోగా, దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన తమ్ముడు సినిమా థియేటర్స్‌లో విడుదలైనప్పుడు మంచి చర్చను సృష్టించింది. కానీ బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా మాత్రం పెద్దగా రాణించలేదు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లయ ప్రధాన పాత్రలో నటించగా, సప్తమి గౌడ, స్వాసిక, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవ వంటి నటీనటులు ముఖ్య పాత్రల్లో కనిపించారు.

థియేటర్స్ తర్వాత ఓటీటీలో కూడా ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మాత్రం బుల్లితెరలో కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతోంది. ఈ చిత్రానికి శాటిలైట్ హక్కులు సంపాదించిన స్టార్ మా, సెప్టెంబర్ 21, 2025 సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది.

Related Posts

Comments

spot_img

Recent Stories