ఎన్టీఆర్ అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న వార్ 2 టీజర్ కి ముహుర్తం ఫిక్స్ అయిందనే సమాచారం ఇప్పుడు ఫ్యాన్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా భారీ ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేసారు. ఆ ప్లాన్‌లో భాగంగా వార్ 2 టీజర్ విడుదల చేయబోతున్నారట.
ఇది తారక్ బాలీవుడ్ ఎంట్రీ కావడంతో మాత్రమే కాకుండా, ఆయనకి దక్కిన మొదటి హిందీ సినిమా ఇదే కావడంతో హైప్ తారాస్థాయిలో ఉంది. పైగా యాష్ రాజ్ ఫిలింస్ వాళ్లకి చెందిన బిగ్గెస్ట్ యాక్షన్ యూనివర్స్ లో భాగంగా వస్తుండటంతో ఎన్టీఆర్ పాత్రపై కుర్రాళ్లలో ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే మే 20న టీజర్ రిలీజ్ అవుతుందన్న సంగతి తెలిసిపోయింది. కానీ సరిగ్గా ఏ సమయంలో బయటపడుతుంది అనేది మాత్రం క్లారిటీ లేకుండా ఉంది. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఉదయం 11 గంటలకు టీజర్ అన్ని భాషల్లో విడుదల కానుందని తెలుస్తోంది.
అఫిషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేకపోయినప్పటికీ, ఈ సమయమే ఫిక్స్ అయ్యిందన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అన్నీ సెటప్ అయ్యి ఉండటంతో ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశముంది. టీజర్ పాన్ ఇండియా ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేసేలా ఉంటుందన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి.
అంతేకాదు, ఎన్టీఆర్ లుక్, క్యారెక్టర్ డిజైన్ మరియు యాక్షన్ పార్ట్ పై ఇప్పటికే విపరీతమైన ఆసక్తి నెలకొంది. అభిమానులకి ఇది ఫుల్ మాస్ ఫెస్టివల్‌గా మారనుంది.