కిష్కిందపురి టీజర్‌ ఎప్పుడంటే!

టాలీవుడ్‌లో వస్తున్న హారర్ థ్రిల్లర్ సినిమా కిష్కింధపురిపై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తుండగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ జంట స్క్రీన్‌పై ఎలా అలరిస్తారో చూడాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, చిన్న వీడియోలు ఈ సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి. ఇప్పుడు మేకర్స్ టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం టీమ్‌కు ఉంది.

టీజర్‌ను ఆగస్టు 15 సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా, సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ కోసం రెడీ అవుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories