సరిపోదా శనివారం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే!

నేచురల్ స్టార్ నాని తాజాగా నటిస్తున్న సినిమా ‘సరిపోదా శనివారం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని ఆగస్టు 29న గ్రాండ్ గా విడుదలకు రెడీ అయ్యింది. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించడంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటిచ్చింది. ఈ సందర్భంగా హీరో నాని, ప్రియాంక మోహన్, నిర్మాత డీవీవీ దానయ్యలతో పాటు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ మీడియా మీట్‌లో ‘సరిపోదా శనివారం’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్‌ను వారు తాజాగా ప్రకటించారు. ఆగస్టు 24న ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుందని వారు తెలిపారు.

దీంతో అభిమానులు ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఈవెంట్‌కి ఎవరు గెస్ట్‌గా వస్తారా.. ఈ ఈవెంట్ ఎక్కడ నిర్వహిస్తారా అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గానే ఉంది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర యూనిట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories