ఆర్టీ 76 ముహుర్తం ఎప్పుడంటే!

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం తన తాజా చిత్రం మాస్ జాతర షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తవుతూనే ఆయన తన తదుపరి ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ కొత్త సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకి వచ్చింది.

రవితేజ కెరీర్‌లో 76వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాను కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందించబోతున్నారు. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలకు తేదీ కూడా ఫిక్స్ చేశారు. జూన్ 5వ తేదీ ఉదయం 9:02కి ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్ కానుంది.

ఈ సినిమాను ఎస్‌ఎల్‌వి సినిమాస్ సంస్థపై సుధాకర్ చెరుకూరి నిర్మించబోతున్నారు. అయితే ఇందులో రవితేజతో పాటు ఎవరు నటిస్తున్నారో, టెక్నికల్ టీమ్‌లో ఎవరు ఉన్నారో వంటి వివరాలు త్వరలో వెల్లడికావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు నెమ్మదిగా జరగుతున్నాయి. ఫ్యాన్స్ మాత్రం రవితేజ నుంచి మళ్లీ ఓ మాస్ ట్రీట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories