నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అర్జున్ S/O వైజయంతి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తుండగా యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ‘అర్జున్ S/O వైజయంతి’ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ 18న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. దీంతో ఈ వేసవిలో యాక్షన్‌కు ఏమాత్రం కొదువ లేకుండా మరో ఇంట్రెస్టింగ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి హీరో తల్లి పాత్రలో.. మరోసారి పోలీస్ పాత్రలో సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాలో సాయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోండగా అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.