యంగ్ హీరో తేజ సజ్జ “హను మాన్”తో సూపర్ హిట్ అందుకున్న తర్వాత ఇప్పుడు చేస్తున్న సూపర్ హీరో సినిమా “మిరాయ్”. ఈ ప్రాజెక్ట్‌ని “ఈగల్”తో తన ప్రతిభ చూపిన దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్నారు. స్టార్ట్ నుంచే ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.
ఇక ఎట్టకేలకు మేకర్స్ ట్రైలర్ రిలీజ్ డేట్‌ని ఖరారు చేశారు. ఆగస్టు 28న ట్రైలర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీనికి సంబంధించిన ఒక కొత్త పోస్టర్‌ని కూడా షేర్ చేశారు. అందులో తేజ సజ్జ, మంచు మనోజ్ మధ్య యాక్షన్ సీన్ ని చూపిస్తూ సినిమా లోని ఆసక్తికరమైన కాంబినేషన్‌ని హైలైట్ చేశారు.
ఇప్పటివరకు ఈ సినిమాను సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్‌ని మార్చి, సెప్టెంబర్ 12న పాన్ వరల్డ్ లెవెల్లో థియేటర్లలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు.