ముహుర్తం ఎప్పుడంటే!

హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల మరి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఎంతోకాలంగా రహస్య స్నేహితులుగా ఉన్న వీరు ఆగస్టు 8న నిశ్చితార్థం జరుపుకున్నారు. తాజాగా వీరి పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి.

దీనికి సంబంధించిన ఫొటోలను శోభితా ధూళిపాళ్ల సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి.

అప్పటినుంచి వీరి పెళ్లి ఎప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వీరి పెళ్లి డేట్‌ ఫిక్స్‌ అయినట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్‌లో చైతూ – శోభిత వివాహబంధంతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. డిసెంబర్‌ 4వ తేదీన వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు టాలీవుడ్‌లో ఓ టాక్‌ నడుస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories