బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ హీరోగా, మన తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన మాస్ యాక్షన్ డ్రామా జాట్ అనే సినిమా ఇటీవల హిందీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దక్షిణ భారతీయ శైలిలో రూపొందిన ఈ సినిమాకు ఉత్తర భారతదేశంలోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. సన్నీ డియోల్ కెరీర్లో ఇది ఒక సాలిడ్ హిట్గా నిలిచింది.
ఏప్రిల్లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు ఓటిటీలో విడుదల కాకపోవడంతో అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. అయితే చివరికి స్ట్రీమింగ్కు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇప్పుడు అందరికీ తెలుసు, ఈ ఫ్లాట్ఫామ్లోనే జాట్ సినిమా స్ట్రీమ్ కాబోతోందని.
తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం జూన్ 6నుంచి ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా కేవలం హిందీ భాషలో మాత్రమే స్ట్రీమ్ కానున్నట్లు స్పష్టమైంది. అంటే హిందీ ఆడియెన్స్ అయితే ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే చాలు, జాట్ సినిమాను ఇంట్లోనే చూసేయచ్చు.
ఇంకా ఈ సినిమాకు మ్యూజిక్ అందించినది తమన్ కాగా, నిర్మాణ బాధ్యతలు మైత్రి మూవీ మేకర్స్ చేపట్టారు. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి మైత్రి సంస్థ అడుగుపెట్టింది. సినిమా కథ, నటన, మ్యూజిక్ అన్నీ కలిసొచ్చి ప్రేక్షకులకు మంచి అనుభూతినే ఇచ్చాయని చెప్పొచ్చు.