మాస్ కా దాస్‌గా పేరుగాంచిన విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫంకీ’ ప్రస్తుతం వేగంగా చిత్రీకరణ దశలో ఉంది. వినోదాత్మక సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనుదీప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో, ఈసారి కూడా ఆయన స్పెషల్ కామెడీ టచ్‌తో సినిమా ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక పెద్ద అప్డేట్ను చిత్రబృందం విడుదల చేసింది. అక్టోబర్ 10న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. టీజర్లో హాస్యభరిత సన్నివేశాలు, వినోదాత్మక సన్నివేశాలతో ప్రేక్షకులను పగలబరచేలా ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు.