బన్నీ-మాటల మాంత్రికుని మూవీ ఎప్పుడంటే!

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తరువాత మూవీ కోసం రెడీ అవుతున్నాడు. అయితే ఈ చిత్రం ఆల్రెడీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో స్టార్ట్ కావాల్సి ఉంది కానీ అది ఇంకా మొదలు కాలేదు. అయితే దీని ప్లేస్ లో దర్శకుడు అట్లీతో భారీ సినిమా ఉంటుంది అనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది.

ఇంకోపక్క ఇండియన్ సినిమా దగ్గర ఏ హీరో కానీ దర్శకుడు కానీ టచ్ చెయ్యని ఒక ఫాంటసీ సబ్జెక్టుని బన్నీ, త్రివిక్రమ్ లు తెస్తున్నట్టుగా టాక్ ఉంది. ఇక ఈ సినిమా ఎపుడు మొదలు కానుంది అనే దానిపై ఇపుడు తాజా సమాచారం ఒకటి బయటకు వచ్చింది. దీని ప్రకారం ఈ కాంబినేషన్ లో సినిమా ఈ ఏడాది అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టుకుంటుంది అని నిర్మాత నాగ వంశీ కన్ఫర్మ్ చేశారు. లేటెస్ట్ గా పెట్టిన మ్యాడ్ స్క్వేర్ ప్రెస్ మీట్ లో ఈ సాలిడ్ అప్డేట్ ని ఇచ్చారు.

Related Posts

Comments

spot_img

Recent Stories