స్టార్ బ్యూటీ పూజా హెగ్డే టైమ్ ఏమాత్రం బాగాలేదని చెప్పాలి. ఆమె నటిస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర ఫ్లా్ప్స్‌గా నిలుస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా అమ్మడి కెరీర్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. తాజాగా స్టార్ హీరో సూర్య సరసన రెట్రో సినిమాలో నటించింది పూజా హెగ్డే.
ఈ సినిమా మే 1న వరల్డ్‌వైడ్‌గా మంచి బజ్‌తో రిలీజ్ అయ్యింది. అయితే, ఈ సినిమాలో ఆమె పాత్రకు ప్రశంసలు దక్కినా, సినిమా రిజల్ట్ మాత్రం మారడం లేదు. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి తొలిరోజు అంతంత మాత్రంగా రివ్యూలు లభించాయి. దీనికి తోడు బాక్సాఫీస్ దగ్గర ఇతర బిగ్ సినిమాలు కూడా పోటీ పడటంతో రెట్రో చిత్రానికి పెద్దగా ఆదరణ రాలేదు.
పూజా నటించిన లాస్ట్ 7 చిత్రాలు వరుసగా ఫ్లాప్‌లుగా నిలవడంతో ఆమె అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.మరి పూజా తరువాత సినిమా అయినా కమ్ బ్యాక్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.