ఓదెల 2 వచ్చేది ఎప్పుడంటే! టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా చాలా కాలం తర్వాత తెలుగులో చేసిన అవైటెడ్ చిత్రమే “ఓదెల 2”. దర్శకుడు సంపత్ నంది అందించిన కథతో వస్తున్న ఈ క్రేజీ డివోషనల్ థ్రిల్లర్ చిత్రం ఈ మధ్య టీజర్ తో మంచి బజ్ ని అందుకుంది. ఇక ఈ చిత్రం రిలీజ్ కోసం ఎప్పుడు నుంచో సస్పెన్స్ అలా కొనసాగుతుంది. మరి ఫైనల్ గా ఇపుడు మేకర్స్ రిలీజ్ డేట్ ని అయితే పవర్ఫుల్ పోస్టర్ తో ఇచ్చేసారు.
ఇలా ఓదెల పార్ట్ 2 ని మేకర్స్ ఈ ఏప్రిల్ 17న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇక ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహించగా తెలుగు సహా పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రాన్ని మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి కాంతార, విరూపాక్ష, మంగళవారం సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా మధు క్రియేషన్స్ అలాగే సంపత్ నంది టీం వర్క్ వారు నిర్మాణం వహించారు.