అప్పన్న ఎప్పుడు వస్తున్నాడంటే!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా,  కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా మావెరిక్ డైరెక్టర్‌ శంకర్ రూపొందిస్తున్న మోస్ట్‌  అవైటెడ్ మూవీ  “గేమ్ ఛేంజర్” గురించి అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ మూవీ కోసం మెగా అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ మూవీ ట్రైలర్ కోసం అంతా ఓ రేంజ్ లో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ ఈ ట్రైలర్ కోసం ఈ కొత్త ఏడాది కానుకగా బ్లాస్టింగ్ అప్డేట్ విడుదల చేశారు.చరణ్ పోషించిన అప్పన్న పాత్ర నుంచి సాలిడ్ పోస్టర్ తో ఈ ట్రైలర్ ని రేపు జనవరి 2న సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకి విడుదల చేస్తున్నట్టుగా ముహుర్తం ఫిక్స్‌ చేశారు.

దీంతో గేమ్ ఛేంజర్ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది క్రేజీ న్యూస్ అనే చెప్పుకొవచ్చు.   

Related Posts

Comments

spot_img

Recent Stories