మ్యాన్ ఆఫ్ మాసెస్ నటించిన రీసెంట్ మూవీ ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కళ్లు చెదిరే వసూళ్లు సాధించింది.
ఇక ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అయిన దగ్గర్నుంచి ఈ చిత్రానికి అందులోనూ సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ సినిమా బుల్లితెరపై ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కానీ, ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్ముడుకాలేదని.. ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ కోసం ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
దీంతో దేవర కథను బుల్లితెరపై ప్రేక్షకులకు చూపించేది ఎప్పుడని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఈ చిత్ర శాటిలైట్ టెలికాస్ట్ గురించి మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారా అనేది వేచి చూడాలి.