క్లారిటీ ఎప్పుడు?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యంగ్‌ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్‌  వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “విశ్వంభర”. అయితే ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా చాలా కాలం గ్యాప్ తర్వాత రిలీజ్ కి వచ్చిన ఫస్ట్ సింగిల్ రామ రామ సూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ వింటేజ్ వైబ్స్ ని చూపిస్తూ మంచి ట్రీట్ ని అందించింది.

అయితే ప్రస్తుతానికి ఈ సాంగ్ ని మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుండగా ఇపుడు సినిమా రిలీజ్ కోసం ఓ క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు. మొన్న సాంగ్ తోనే రిలీజ్ డేట్ వస్తుంది అని చాలా మంది భావించారు. కానీ ఈ తేదీ ని మాత్రం మేకర్స్ ఇప్పటికి బయటకు చెప్పలేదు. దీంతో ఈ క్లారిటీ ఎప్పుడు అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మేకర్స్ ఇదెప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories