తెలుగు టెలివిజన్ లో రియాలిటీ షోలకి కొత్త ట్రెండ్ ని తీసుకొచ్చిన షో బిగ్ బాస్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ షోకి ఉన్న క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. ముఖ్యంగా మన తెలుగు వెర్షన్ కి దేశవ్యాప్తంగా అత్యధిక రేటింగ్ రావడం గమనించదగ్గ విషయం. ఇప్పటికే ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తయి ఇప్పుడు తొమ్మిదో సీజన్ కి రంగం సిద్ధమైంది. ఈసారి గేమ్ ను ఇంకా కఠినంగా ప్లాన్ చేస్తూ, కింగ్ నాగార్జున హోస్ట్ గా ముందుకు వస్తున్నారు.
కొత్త సీజన్ మొదలు కావడానికి ముందే, ప్రేక్షకుల ఉత్సాహం పెంచేందుకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష పేరుతో చిన్న టాస్క్ షో ని చూపించారు. ఆ తర్వాత అసలైన సీజన్ ఎప్పుడు మొదలు అవుతుందా అనే సస్పెన్స్ ని కొనసాగించారు. ఇప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ కి ఫుల్ స్టాప్ పెడుతూ, సెప్టెంబర్ 7న తొమ్మిదో సీజన్ గ్రాండ్ లాంచ్ కానుందని అధికారికంగా ప్రకటించారు.