ఆ సినిమా కోసం వెళ్తే నన్ను రిజెక్ట్‌ చేశారు

మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఫ్యామిలీ స్టార్‌. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబధించిన ప్రమోషన్స్‌ లో విజయ్‌ దేవరకొండ తెగ పాల్గొంటున్నారు. ఈ సినిమాలో విజయ్‌ సరసన మృణాల్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి దిల్ రాజ్‌ నిర్మాత గా ఉండగా… పరుశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి గోపి సుందర్‌ సంగీతం అందించారు.

తాజాగా ఓ ప్రెస్‌ మీట్‌ లో పాల్గొన్న విజయ్‌ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కేరింత సినిమా ఆడిషన్ కి వెళ్లిన సమయంలో తనని రిజెక్ట్‌ చేశారు.. కానీ వాళ్లందరికీ నేనంటే ఏంటో ఇప్పుడూ తెలుస్తుంది అనుకుంటా అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే బ్యానర్ లో ఏప్రిల్‌ 5 న మీ అందరి ముందుకు ఫ్యామిలీ స్టార్ సినిమాతో వస్తున్నట్లు తెలిపారు.

Related Posts

Comments

spot_img

Recent Stories