మళ్లీ ఎప్పుడంటే! రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘ది రాజా సాబ్’ మూవీలో యాక్ట్ చేస్తున్న ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఓ పీరియాడిక్ లవ్ స్టోరీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్‌లో ప్రభాస్‌కు ఇటీవల గాయం అయ్యింది. ప్రస్తుతం ఆయన గాయం నుంచి కోలుకుంటున్నాడు. అయితే, ప్రభాస్ తిరిగి ఈ మూవీ షూటింగ్‌లో జనవరి 4 నుంచి జాయిన్ కాబోతున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినపడుతున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌పై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
2025లో ‘ది రాజా సాబ్’ చిత్రాన్ని విడుదలకు రెడీ చేస్తున్న ప్రభాస్, ‘ఫౌజీ’ చిత్రాన్ని ఈ ఏడాదిలో ముగించాలని చూస్తున్నాడు. దీనికితోడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ‘స్పిరిట్’ సినిమాను కూడా ప్రభాస్ ప్రారంభించబోతున్నాడు. దీంతో ఈ ఏడాది ప్రభాస్ తన అభిమానులకు సాలిడ్ ట్రీట్ ఇవ్వడం గ్యారంటీ.