బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, స్టార్ బ్యూటీ రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో రాబోతున్న చిత్రం ‘సికందర్’. కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కాబోతుంది. ఈద్ సందర్భంగా రాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్ ఈవెంట్ నిర్వహించింది. ఆ వేడుకలో సల్మాన్ ఖాన్ -రష్మిక వయసు తేడా గురించి సల్మాన్ ఖాన్ కి ఓ ప్రశ్న ఎదురు అయింది.
ఈ ప్రశ్నకు సమాధానంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘మా వయసు గురించి మీకెందుకు ?, నాకు, రష్మికకి మధ్య దాదాపు 31 ఏళ్ల తేడా ఉందని అంటున్నారు. అయినా, హీరోయిన్‌కు గానీ, ఆమె తండ్రికి గానీ లేని సమస్య మీకెందుకు ?, ఒకవేళ భవిష్యత్తులో రష్మికకు పెళ్లై పాప పుడితే, ఆ పాప కూడా హీరోయిన్ అవుతుంది. అప్పుడు ఆ పాపతో కూడా నేను కలిసి నటిస్తా’ అని సల్మాన్ ఖాన్ సమాధానమివ్వడం విశేషం. ఇక ‘సికందర్’ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది.