ఏం లేదా?

ఏం లేదా? నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇపుడు నటిస్తున్న అవైటెడ్ చిత్రం “అఖండ 2” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేస్తున్న ఈ భారీ చిత్రంపై అనేక అంచనాలు కూడా నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం నేపథ్యం ఏంటి అనేది అందరికీ తెలిసిందే. 

బాలయ్య అఘోర పాత్రలో పరమ శివునికి మహాభక్తునిగా కనిపించిన సంగతి తెలిసిందే. అలాగే పార్ట్ 1 లో కూడా మహాశివుని ఫ్యాక్టర్ సినిమాని ఎంతగానో సేవ్ చేసింది. మరి పార్ట్ 2 కూడా ఇదే నేపథ్యంలో తెరకెక్కిస్తుండగా నేడు మహాశివరాత్రి కానుకగా మేకర్స్ నుంచి ఎలాంటి ఎలాంటి ఊసు లేకపోవడం గమనార్హం. అభిమానులు కూడా ఈ స్పెషల్ డే కి స్పెషల్ అప్డేట్ ని ఆశిస్తారు. 

మరి మేకర్స్ నుంచి ఇలా ఎలాంటి ఉలుకు లేకపోవడం ఆశ్చర్యమే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్ ప్లస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories