కొత్త విషయం ఏంటంటే! ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్నమూవీ పై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. అయితే ఈ నెల రెండో వారంలో జరిగే షెడ్యూల్ లో ఎన్టీఆర్ కూడా షూట్ లో జాయిన్ కానున్నాడని ఆ మధ్య టాక్ వినిపించింది. తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఎన్టీఆర్ పై ఓ సాంగ్ ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సాంగ్ షూట్ తోనే సినిమా మొదలు కాబోతుందని తెలుస్తోంది.
ఈ మూవీ టైటిల్ ‘డ్రాగన్’ అని ప్రచారంలో ఉంది. అయితే ‘డ్రాగన్’ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడట. కాబట్టి, ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు అయితే ఉన్నాయి.
ఆ మధ్య ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ‘ఆడియన్స్ ఊహించని స్థాయిలో ఈ మూవీని తీస్తున్నాను. ఎన్టీఆర్ పై అభిమానంతో ఈ సినిమా చేస్తున్నాను అని ఆయన అన్నారు.