మీరేమనుకున్నా పర్లేదు సామి…వాల్తేరు వీరయ్య దేనికి పనికిరాదంతే!

యంగ్‌ డైరెక్టర్‌ బాబీ డైరెక్షన్‌ లో నందమూరి బాలయ్య బాబు హీరోగా నటిస్తున్న తాజా సినిమా డాకు మహారాజ్‌.ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనుంది సినిమా బృందం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం  తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో దర్శకుడు బాబీ, నిర్మాత నాగవంశీ పాల్గొన్నారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో నాగవంశీ.. ‘డాకు మహారాజ్’ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతంహాట్ టాపిక్ గా మారాయి.డైరెక్టర్ బాబీ.. ‘డాకు మహారాజ్’ సినిమాను ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కంటే బాగా తీశారు. ఈ విషయంలో చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్లేదని సంచలనస్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ గా మారింది.

మాములుగా నాగవంశీ.. ప్రెస్ మీట్ లలో కాస్త ఓవర్ గానే రియాక్ట్ అవుతుంటాడు. అయితే ఈసారి బాలయ్యను హైలైట్ చేయాలనే ఉద్దేశంతో మెగాస్టార్ సినిమాను తక్కువ చేసి మాట్లాడారు. మరి ఈ కామెంట్స్ పై మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ‘డాకు మహారాజ్’ సినిమాలో బాలయ్య సరసన శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories