‘రూ 500 కోట్లు’ ఉంటే ఎవరేం చేస్తారు?

‘500 కోట్ల రూపాయలు మీ వద్ద ఉంటే ఏం చేస్తారు?’ అనే ప్రశ్నకు మనం వెంటనే సమాధానం చెప్పలేకపోవచ్చు. అంత పెద్ద అమౌంట్ వినగానే మన బుద్ధి, ఆలోచన స్తంభించి పోవచ్చు. కానీ ప్రభుత్వాలకి 500 కోట్ల రూపాయలు మరీ ఆలోచనలను స్తంభింప చేసేంత పెద్ద అమౌంట్ కాదు. ఆ సొమ్ము వెచ్చించడానికి ప్రభుత్వాల వద్ద చాలా రకాల ప్రణాళికలు ఉంటాయి. విశాఖపట్నం నగర అభివృద్ధిని సర్వతోముఖంగా సాకారం చేస్తామని చెప్పే ప్రభుత్వాలు 500 కోట్ల రూపాయలు కేటాయించగలిగితే ఏయే పనులు చేస్తాయి? అని మీమాంస ఇప్పుడు ప్రజల్లో నడుస్తోంది. ఎందుకంటే 2041 నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా విశాఖ నగరం ఎంతగా అభివృద్ధి చెందగలదో అప్పటి అవసరాలకు తగిన విధంగా రోడ్ల విస్తరణ ఇతర మౌలిక వసతులు కల్పన కోసం చంద్రబాబు నాయుడు సారధ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏకంగా 500 కోట్ల రూపాయలను కేటాయించింది. విశాఖ అభివృద్ధికి బృహత్ ప్రణాళికలో భాగంగా ఈ సొమ్మును  వెచ్చించబోతున్నారు.

ఒకసారి ఐదేళ్ల వెనక్కి వెళ్లి పరిస్థితులను ఆలోచించి చూడండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో.. ప్రభుత్వం వద్ద 500 కోట్ల రూపాయలు ఉంటే ఏం చేస్తారు? అనే ప్రశ్నకు తక్షణ సమాధానం రెడీగా ఉంది. విశాఖలో రుషికొండకు గుండు కొట్టించి తాను నివాసం ఉండడానికి విలాసవంతమైన భవంతులను కట్టిస్తారు జగన్మోహన్ రెడ్డి! తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి ప్రాంతాన్ని మరుభూమిగా మార్చే దుర్మార్గమైన లక్ష్యంతో మూడు రాజధానుల విచిత్రమైన కాన్సెప్ట్ ను తెరమీదకు తెచ్చారు వైయస్ జగన్! విశాఖపట్నం నగరాన్ని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా తయారు చేస్తానని ప్రకటించిన ఆయన అక్కడి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటే వాస్తవానికి విశాఖ ఒక్కటి మాత్రమే రాజధాని అని, అమరావతి, కర్నూలు నామ్కే వాస్తేగా ఉంటాయని ఆయన పార్టీ నాయకులు విశాఖ తో పాటు ఉత్తరాంధ్ర ప్రజలందరినీ కూడా మభ్యపెడుతూ వచ్చారు. విశాఖను రాజధానిగా అనడం వలన ఆ ప్రాంతమంతా అత్యద్భుతమైన అభివృద్ధి పరుగులు పెట్టబోతోందని వారు ప్రజల ముందు ఊదరగొట్టారు. కానీ ఏం జరిగింది? విశాఖ నగరాన్ని కెల్లా ఐదేళ్ల జగన్ పరిపాలన కాలంలో చేసినది ఒకే ఒక్క పని! అది కూడా టూరిజం శాఖ ఆధ్వర్యంలో అతిథి భవనాలు కడుతున్నాం అనే ముసుగు వేసి జగన్మోహన్ రెడ్డి– తాను మరియు తన ఇద్దరు కూతుళ్లు నివాసం ఉండడానికి వీలుగా మూడు అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ లను నిర్మింప చేసుకున్నారు! వాటికి మరోవైపు తన క్యాంపు కార్యాలయం సిబ్బంది కూర్చునేలా కూడా వేరే భవనాలను నిర్మింప చేశారు. క్యాంపు కార్యాలయం ప్రాంతం నుంచి ఆయన నివాసం ఉండదలచుకున్న భవనాలవైపు నరమానవులు వెళ్లకుండా భారీ గేట్లను కూడా ఏర్పాటు చేశారు. ఏతావతా చెప్పొచ్చేదేంటంటే రాజధాని అనే ప్రకటన జరిగిన తర్వాత విశాఖలో తన కోసం సర్కారు సొమ్ముతో భారీ భవంతులను నిర్మింపజేయడం మినహా జగన్ ఆ నగరానికి మరొక మేలు చేయలేదు!

తాను బతిమిలాడిన ఒక్క ఛాన్స్ ఇచ్చిన తెలుగు ప్రజలు తాను వేసే బిస్కెట్లకు ఆశపడి మరో 30 ఏళ్ల పాటు తనకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పిస్తూనే ఉంటారని జగన్మోహన్ రెడ్డి తలపోశారు. అందుకే తనకు ఎదురు చెప్పగల మొనగాడు ఎవ్వరు ఉండరు అని ప్రభుత్వ సొమ్మును సొంత భవనాల కోసం విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారు. అదే అభివృద్ధి అనుకోవాలి అన్నట్లుగా విశాఖపట్నం వాసులను ఆయన మోసం చేశారు.

కానీ చంద్రబాబు నాయుడు సారధ్యంలో దార్శనికత అంటే ఎలా ఉంటుందో భవిష్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని విశాఖ నగరాన్ని సరికొత్త మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా తయారు చేయడం ఎంత కీలకమో ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. 2041 నాటికి సరైన రోడ్డు వసతులు ఏర్పడేలా అద్భుతమైన కార్యచరణ ప్రణాళికతో రూ.500 కోట్ల నిధులు కేటాయించారు. దీంతో చంద్రబాబు నాయుడు కార్యశీలత మీద విశాఖ వాసులలో అనన్యమైన విశ్వాసం ఏర్పడుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories