పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా పలు పెద్ద సినిమాలతో బిజీగా ఉంటున్నారు. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా పేరున్న ఆయన పెళ్లి విషయంపై చాలా కాలంగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఎవరి తో పెళ్లి, ఎప్పుడు జరుగుతుందన్న కుతూహలం అభిమానుల్లో ఎప్పుడూ ఉంటుంది.
ఇప్పుడీ టాపిక్ మరోసారి హాట్‌గా మారింది. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఇటీవల జరిగిన ఒక పూజా కార్యక్రమంలో పాల్గొని, తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ప్రభాస్ పెళ్లికి సంబంధించిన శుభవార్త త్వరలోనే వినిపించబోతుందనే సంకేతాలు ఇచ్చారు.
ఆమె వ్యాఖ్యలతో మళ్లీ అభిమానుల్లో చర్చ మొదలైంది. ప్రభాస్ పెళ్లి ప్రకటన ఎప్పుడు వెలువడుతుందన్న ఆసక్తి అందరిలో పెరిగిపోతోంది.