ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సంచలనంగా మారిన కన్నడ సినిమా “కాంతార చాప్టర్ 1” గురించి అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించిన రిషబ్ శెట్టి మరోసారి తన ప్రతిభను చూపించాడు. రిలీజ్ అయినప్పటి నుండి ఈ సినిమా మీద భారీ రివ్యూలు వస్తున్నాయి. ప్రేక్షకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ చిత్రాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఇక తాజాగా టీం ఇండియా క్రికెటర్ కే ఎల్ రాహుల్ కూడా ఈ సినిమాపై తన స్పందనను తెలియజేశాడు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమా చూసిన అనుభవాన్ని పంచుకున్నాడు. “కాంతార”లో చూపించిన మంగుళూరు సంస్కృతి, ప్రజల విశ్వాసాన్ని అద్భుతంగా ప్రదర్శించారని, రిషబ్ మళ్లీ తన మ్యాజిక్ చూపించారని రాహుల్ పేర్కొన్నాడు.