“విశ్వంభర” నుంచి ఎలాంటి ట్రీట్‌ రాబోతుందంటే!

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా , స్టార్‌ హీరోయిన్‌ త్రిష హీరోయిన్‌ గా, బింబిసార ఫేమ్‌ వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ చిత్రం  “విశ్వంభర” కోసం మెగా అభిమానులు, టాలీవుడ్‌ అభిమానులు కూడా  ఓ రేంజ్ లో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా చాలా కాలం తర్వాత చిరు నుంచి వస్తున్నా ఫాంటసీ వండర్ కావడంతో కేజ్రి హైప్ నెలకొంది. ఇక ఈ సినిమా షూటింగ్ సంబధించి తాజాగా లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది.

అయితే ఈసారి మెగాస్టార్ బర్త్ డే కానుకగా మంచి ట్రీట్ ఉండబోతుందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అనుకున్నట్టుగానే ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే చిరు బర్త్ డే కానుకగా డైరెక్ట్ గా టీజర్ వస్తుందా లేక కేవలం గ్లింప్స్ ని కానీ విడుదల చేస్తున్నారా అనేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

ప్రస్తుతానికి అయితే గ్లింప్స్ మాత్రమే కేవలం చిరుకి బర్త్ డే విషెష్ చెబుతూ ఆయన పై షాట్స్ లో వదిలే ప్లాన్ లో ఉన్నట్టుగా సమాచారం. మరి దీని గురించి మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 10న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories