ఏ సమాజంలో బతుకుతున్నాం..మనం!

ఎందరో మహనీయులు తమ ప్రాణాలను పణంగా పెట్టి తమ రక్తాన్ని చిందించి…జైలు జీవితాలను అనుభవించి..భరతమాత బానిస సంకెళ్లు తెంచి బ్రిటీష్‌ వాడిని తరిమికొట్టి భారతమాతకు వేసిన సంకెళ్లను తెంచిన వీర మహిళల పోరాటమే..నేడు యావత్‌ భారత్‌ దేశం సంబరంగా చేసుకుంటున్న స్వాతంత్య్ర సంబంరం.

కానీ నేడు ఆ వీరనారి కొందరు మృగాళ్ల చేతిలో అత్యచారానికి గురై బలైపోతుంది. ఇటీవల కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై ఉపాసన కొణిదెల విచారం వ్యక్తం చేస్తూ “X” ఖాతాలో పోస్ట్ చేసారు. మానవత్వాన్ని అపహాస్యం చేసే ఘటన ఇది. సమాజంలో అనాగరికత పెరిగిపోయింది, అసలు మనం ఎలాంటి స్వాతంత్య్రం జరుపుకుంటున్నాం, దేశ ఆరోగ్య సంరక్షణకు మహిళలే కీలకం, అటువంటి మహిళలపై రోజు జరుగుతున్న దాడులు చూస్తుంటే గుండె బరువెక్కుతోంది.

మనుషుల్లో అసలు మాన‌వ‌త్వమనే కనిపించడం లేదు, మాన‌వ‌త్వాన్నే అప‌హాస్యం చేసే ఘ‌ట‌న కోల్‌కతా జరిగింది. స‌మాజంలో అనాగ‌రిక‌త కొన‌సాగుతుంటే మ‌నం ఎలాంటి స్వాతంత్ర్యాన్ని మనం  జరుపుకుంటున్నామ‌ని ఉపాసన ప్రశ్నించారు.భారతదేశంలో ఆరోగ్య సంరక్షణలో మహిళలు ప్రధానపాత్ర పోషిస్తారు. ఈ రంగంలోని వ‌ర్క్‌ఫోర్స్ లో 50 శాతానికి పైగా మంది మ‌హిళ‌లే ఉన్నారు. అంతేగాక ప‌లు అధ్యాయ‌నాలు మ‌హిళా హెల్త్ వ‌ర్క‌ర్లే రోగుల‌తో ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్న‌ట్లు తేల్చాయ‌ని ఈ సందర్భంగా ఉపాసన గుర్తు చేశారు.

మ‌హిళ‌లు మ‌న హెల్త్ రంగానికి చాలా అవసరం. అందుకే ఎక్కుమంది మ‌హిళ‌ల‌ను వ‌ర్క్‌ఫోర్స్ లోకి, అందులోనూ హెల్త్‌కేర్ విభాగంలోకి తీసుకురావ‌డం త‌న లక్ష్యమని ఉపాసన అన్నారు. ఈ విభాగంలో వారి అవ‌స‌రం చాలా ఉంద‌న్నారు. కోల్‌కతాలో జరిగిన ఘటన నా సంకల్పాన్ని మరింత బలపరిచింది. ప్రతి స్త్రీకి భద్రత, గౌరవం అవసరం. మనమంతా కలిసి ఉంటే సమాజంలో మార్పు తీసుకురావచ్చు’ అని ఉపాసన కొణిదెల అన్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories