ఏంటి మొదటి సినిమాకే ఇంత ఇస్తున్నారా?

ప్రభాస్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హను రాఘవపూడి డైరెక్షన్‌ లో ఈ మధ్యనే ఒక సినిమా ఓపెనింగ్ ఘనంగా జరిగింది.  ఫౌజీ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించి జరుగుతున్న చర్చలు హాట్ టాపిక్ గా మారాయి.

 ఈ సినిమాలో పాకిస్తానీ మూలాలున్న నటి ఇమాన్ ఇస్మాయిల్ హీరోయిన్‌ గా చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త నటిని తీసుకుని వచ్చి  ఇమాన్విగా నామకరణం చేసి మరి ప్రభాస్ పక్కన నిలపెట్టేశారు. ఆమె ప్రభాస్ పక్కన ఏ మాత్రం సూట్ అవ్వలేదని ఓ వర్గం వారు భావిస్తుంటే ప్రభాస్ పక్కన బలే క్యూట్ గా ఉంది అని మరో వర్గం వారు అనుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆమె సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ మాత్రం వేరే లెవల్‌ అని చెప్పుకోవచ్చు.

ఆమెకి ఇన్స్టాగ్రామ్ లో ఎనిమిది లక్షల అరవై మూడు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రభాస్ సినిమా అనౌన్స్మెంట్ తర్వాత మరింత మంది పెరిగారు. ఆమె ఒక ఇన్ఫ్లుయన్సర్ మాత్రమే కాదు కొరియోగ్రాఫర్ కూడా కేవలం సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ నుంచి ఆమెకు రెండు లక్షల రూపాయలు నెలకు వస్తున్నాయంటే ఆమెకు ఉన్న ఫాలోయింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆమెను తెచ్చి ప్రభాస్ పక్కన హీరోయిన్ గా చేయడమే కాదు ఏకంగా మొదటి సినిమాకే కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తున్నారట మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు.

ఒకరకంగా ఇది రికార్డు రెమ్యూనరేషన్ అనే చెప్పుకోవచ్చు.  ఇలా తెలుగు సినిమాలో ఎంట్రీ ఇస్తున్నప్పుడే భారీ మొత్తాన్ని చెల్లించింది. చాలాకాలం క్రితం కత్రినా కైఫ్ కి మాత్రమే ఇచ్చారు. కత్రినా వెంకటేష్ పక్కన మల్లీశ్వరి సినిమా చేసినప్పుడు ఆమెకు ఇలానే  భారీ మొత్తంలో నగదును అప్పజెప్పారు.

మిగతా హీరోయిన్లతో పోలిస్తే ఇది చాలా చిన్న అమౌంట్ అనిపిస్తుంది. కానీ మొదటి సినిమాకే ఇంత ఆఫర్ రావటం అనేది మామూలు విషయం కాదు.  ప్రభాస్ సినిమా హిట్ అయితే కనుక ఆమె రెండో సినిమాకి ఐదు కోట్లు అడిగినా ఆశ్చర్యం లేదు అని ట్రేడ్ వర్గాల వారు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమెకు సంబంధించిన పాత డాన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆమె డాన్స్ ను ప్రభాస్ సూట్ చేయగలడా? అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories