ఏంటి అంత బడ్జెట్‌ పెట్టారా!

ఏంటి అంత బడ్జెట్‌ పెట్టారా! ఈ సంక్రాంతి కానుకగా విడుదలకి వస్తున్న తాజా సినిమాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా, అంజలీ మరో బ్యూటిఫుల్ రోల్ లో నటించిన మోస్ట్‌ అవైటెడ్ సినిమా “గేమ్ ఛేంజర్”. విడుదల దగ్గరకి వస్తున్న సమయంలో మరింత హైప్ ఈ చిత్రానికి ఏర్పడింది. 

ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్ర పోషించిన విలక్షణ నటుడు ఎస్ జె సూర్య తాజా కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అయితే తాను కోలీవుడ్ లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ సినిమాకి 400 నుంచి 500 కోట్లు బడ్జెట్ ని దిల్ రాజు పెట్టారని చెప్పారు. దీంతో ఇది విన్న కోలీవుడ్ ఆడియెన్స్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో జరగండి సాంగ్ లీక్ అయ్యినపుడు చాలా నిరాశకు గురయ్యాను. 

కానీ ఆ పాట థియేటర్స్ లో మెయిన్ గా ఐమాక్స్ స్క్రీన్ పై చూస్తే ఆడియెన్స్ పెట్టిన టికెట్ డబ్బులు ఆ ఒక్క సాంగ్ కే పైసా వసూల్ అనే రేంజ్ లో ఉంటాయని చెప్పుకొచ్చారు. దీంతో తన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories