మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ చిత్రం “దేవర. అయితే ఈ చిత్రంకి సీక్వెల్ గా దే’వర’ 2 ఖచ్చితంగా ఉందని ఎన్టీఆర్ ఈ మధ్య జపాన్ లో కన్ఫర్మ్ చేసేసారు. ఇక ఈ తర్వాత ఈ సినిమాకి నిర్మాతల్లో ఒకరైన ఎన్టీఆర్ అన్న నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ గా ఇచ్చిన అప్డేట్ వైరల్ గా మారింది.
కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దేవర 2 ప్రశాంత్ నీల్ తో సినిమా తర్వాత ఉంటుందని తేల్చి చెప్పారు. అలాగే నరేషన్ కూడా ఇవ్వడం జరిగింది అంటూ దేవర 2 పై ఇంట్రెస్టింగ్ క్లారిటీని కళ్యాణ్ రామ్ అందించాడు. దీనితో ఈ భారీ సీక్వెల్ పై అప్డేట్ వైరల్ గా మారింది. ఇక కళ్యాణ్ రామ్ సన్నాఫ్ వైజయంతి చిత్రం ఈ ఏప్రిల్ 18న విడుదల అవ్వబోతుంది.