టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ సినిమా ఫ్యామిలీ స్టార్..సినిమా పెద్దగా హిట్ టాక్ అందుకోకపోయినప్పటికీ కూడా మంచి కలెక్షన్స్ ను అయితే అందుకుంది. గతేడాది విజయ్ సమంత కాంబోలో వచ్చిన ఖుషి సినిమా కూడా మంచి టాక్ నే అందుకుంది. ఈ క్రమంలో విజయ్ పాన్ ఇండియా డైరెక్టర్ తో తన నెక్ట్స్ సినిమా చేస్తున్నట్లు ఎప్పటి నుంచో ఓ వార్త నెట్టింట షికారు చేస్తున్న విషయం తెలిసిందే.
విజయ్ దేవరకొండ ఇంటికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వెళ్లడం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ న్యూస్ అయ్యింది. హైదరాబాదులో ఉన్న విజయ్ దేవరకొండ ఇంట్లో దర్శకుడు ప్రశాంత్ కనిపించడంతో కొత్త ఊహగానాలు మొదలయ్యాయి. సోమవారం రాత్రి ప్రశాంత్ నీల్, విజయ్ దేవరకొండకు మధ్య ఓ మూవీ స్టోరీకి సంబందించిన డిస్కర్షన్ జరిగినట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఈ విషయం పై అఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు కానీ ఈ వార్త విన్న విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు..
ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ ఖాతాలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. సలార్2, ఎన్టీఆర్ సినిమాలు అయ్యాకే విజయ్ తో సినిమా చేస్తాడేమో అనే టాక్ వినిపిస్తుంది.. ప్రశాంత్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఓ మూవీ రావాలని కోరుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ కాంబో మాత్రం అదిరింది.