పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న సినిమా హరిహర వీరమల్లు చివరికి థియేటర్లకు రానుంది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ వరుసగా వాయిదాలు పడుతూ వచ్చింది. ఈ ఆలస్యానికి కారణం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటమేనని చాలామంది భావించారు.
అయితే ఈ విషయంపై హీరోయిన్ నిధి అగర్వాల్ స్పష్టత ఇచ్చింది. పవన్ రాజకీయ కారణాల వల్ల సినిమా ఆలస్యం కాలేదని ఆమె చెబుతుంది. షూటింగ్ వాయిదాలకు వేరే కారణాలు ఉన్నాయని, పవన్‌పై అనవసర ఆరోపణలు చేయడం తప్పు అని ఆమె అన్నారు.
ఈ వ్యాఖ్యలు పవన్ అభిమానుల్లో సంతోషం కలిగించాయి. తమ హీరోను ఇంత బలంగా సపోర్ట్ చేసినందుకు నిధికి ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ప్రస్తుతం నిధి అగర్వాల్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇక ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు ఈ నెల 24న భారీగా విడుదల కానుంది.