మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె తన భర్తతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. నిత్యం ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తోంది. యాంకర్ గా ఓ షో చేస్తూనే మళ్లీ హీరోయిన్ గా రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ గా ఉంది. అంతేకాకుండా నిర్మాతగా మారి సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తుంది.
ఈ క్రమంలో ఆమెపై పలు ట్రోల్స్ వచ్చినప్పటికీ ఎవరేమి అనుకున్నా పట్టించుకోకుండా తనకు నచ్చింది చేస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. గ్యాప్ దొరికినప్పుడల్లా తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో టైమ్ కేటాయిస్తూనే కెరీర్‌ను ఫుల్ ఫామ్‌లోకి తెచ్చుకుంది. ఈ క్రమంలోనే నిహారిక తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
అందులో ఏముందంటే.. రెండు ఏనుగులు ముఖాన్ని దగ్గరగా పెట్టుకుని ఓ కపుల్ లవ్‌లో ఉంటే ఎలా ప్రేమగా ఉంటారో అలా కనిపించాయి.ఈ ఫొటో షేర్ చేసిన నిహారిక ప్రేమకు గుర్తుగా చెప్పుకునే.. రెడ్ హార్ట్ సింబల్ కూడా షేర్ చేసింది. దీనిని చూసిన వారంతా కూడా నిహారిక ఈ పోస్ట్ పెట్టడానికి కారణం ఏంటి.. ఆమె మళ్లీ ప్రేమలో పడిందా ? అంటూ చర్చలు మొదలు పెట్టారు.