థలపతి69” మూవీ పై లేటెస్ట్ టాక్‌ ఏంటంటే!

కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ ప్రధాన పాత్రలో నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో ముందుకు దూసుకు పోతుంది. వెంకట్ ప్రభు డైరెక్షన్‌ లో  తెరకెక్కిన ఈ సినిమా లాంగ్ రన్ లో 500 కోట్ల రూపాయల క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ హీరో తదుపరి సినిమా హెచ్. వినోత్ డైరెక్షన్‌ లో  నటించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి తాత్కాలికంగా థలపతి69 అనే టైటిల్ ను ఫిక్స్‌ చేశారు.

ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తున్నట్లు టాక్‌ నడుస్తుంది. అయితే ఈ సినిమా పై సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని టాక్‌ నడుస్తుంది. విజయ్ ను ప్రేక్షకుల ఎలా అయితే చూడాలి అనుకుంటున్నారో, అలా ఈ చిత్రం ఉండనుంది అని టాక్‌. తేరి చిత్రం తరహాలో ఈ సినిమా ఉండబోతుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై మరిన్ని వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories