పెద్ది పై తాజా సమాచారం ఏంటంటే!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. ఒక మాస్ రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ గ్లింప్స్ ని ఈ రామ నవమి కానుకగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గ్లింప్స్ పై కొన్ని రూమర్స్ వైరల్ గా మారాయి.

గ్లింప్స్ వీడియో కట్ బాగానే వచ్చింది కానీ రెహమాన్ స్కోర్ బాలేదు అంటూ కొన్ని మాటలు వైరల్ అవుతున్నాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదట. రెహమాన్ క్రేజీ సౌండింగ్ ఈ గ్లింప్స్ కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ 6న వీడియో వచ్చాక అందరికీ దీనిపై క్లారిటీ కూడా వస్తుంది అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories