తాజా సమాచారం ఏంటంటే!

తాజా సమాచారం ఏంటంటే! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నతాజా సినిమాల్లో ది మోస్ట్ అవైటెడ్ సినిమా ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల సెకండ్ సింగిల్ సాంగ్ ‘కొల్లగొట్టినాదిరో’ అనే పాటను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ డేట్ అండ్ టైం ఫిక్స్ చేసినట్లు వెల్లడించారు. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ సాంగ్‌ను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. ఈ పాటను పూర్తిగా వింటేజ్ సాంగ్‌గా మనకు ప్రెజెంట్ చేయబోతున్నారట. ఇక ఓ భారీ ప్యాలెస్ సెట్‌లో ఈ పాటను 5 రోజుల పాటు చిత్రీకరించారట చిత్ర యూనిట్. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఈ సినిమా హీరోయిన్ నిధి అగర్వాల్‌కు పవన్ కళ్యాణ్‌తో తొలి షాట్ ఈ పాటలోనే ఉందట. అంతేగాక హిందీలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ కాంబోలో వచ్చిన ‘గురు’ మూవీలోని ఎవర్‌గ్రీన్ క్లాసిక్ సాంగ్ ‘తేరే బినా’ పాట తరహాలో ఈ ‘కొల్లగొట్టిందిరో’ పాట ఉండనున్నట్లు సమాచారం.

Related Posts

Comments

spot_img

Recent Stories