ఇంత చిల్లర ఆనందం, ఆరోపణ ఏమిటి సామీ?

జగన్మోహన్ రెడ్డి కోటరీ మొత్తం ఎంత సంకుచితంగా ఆలోచిస్తూ ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఇది మంచి ఉదాహరణ. విజయవాడ నగరం మొత్తం జలదిగ్బంధనంలో చిక్కుకుపోయిన నేపథ్యంలో ప్రభుత్వం అనేక విధాలుగా సహాయక, పునరావాస కార్యక్రమాలు చేపడుతోంది. దీనిమీద కూడా వైసీపీ దళాలు కుటిల రాజకీయం చేస్తున్నాయి. నిన్నటిదాకా.. అసలు ఆహార పొట్లాలు అందడమే లేదంటూ.. ఒక విషప్రచారం చేయడానికి తెగించారు. తీరా ఇప్పుడు అలాంటి ప్రచారం చేస్తే.. తమ మొహం మీదనే జనం నవ్వుతారనే భయంతో.. మరో ప్రచారం ప్రారంభించారు. జగన్ ప్రారంభించిన ఎండీయూ వాహనాలే ఇప్పుడు చంద్రబాబుకు దిక్కయ్యాయట. నిత్యావసర సరుకులు గ్రామాల్లో ఇంటింటికీ పంచడానికి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన వాహనాలే గనుక లేకపోతే.. ఇప్పుడు అసలు వర్షబాధితులకు  ఆహార పొట్లాలు పంచడమే సాధ్యం కాదు అన్నట్టుగా వారు మాట్లాడుతున్నారు.

రాష్ట్రంలో చౌకదుకాణాల వద్ద ఇచ్చే సరుకులను ఇళ్ల వద్దకే పంపడానికి జగన్ వాహనాలు తీసుకువచ్చారు. ఆ పద్ధతిలో ఏం మార్పులేదు. ఇప్పటికీ అలాగే నడుస్తోంది. అయితే.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఆ వాహనాలను పక్కన పెట్టేశారని ఇప్పుడు వైసీపీ దళాలు, వారి కరపత్రిక ఆరోపిస్తున్నాయి. జగన్ తీసుకువచ్చిన ఆ వాహనాలే లేకపోతే గనుక చంద్రబాబు సర్కారుకు వేరే దిక్కేలేదంటూ వారు సంకుచిత ఆనందాన్ని అనుభవిస్తున్నారు.

రోజుకు మూడులక్షల ఆహార పొట్లాలను పది జిల్లాలను సమీకరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఓ పదీ ఇరవై వాహనాలను సమీకరించలేకుండా పోతుందా? ఇంత జ్ఞానం లేకుండా వైసీపీ వారు ఎలా మాట్లాడగలుగుతున్నారా? అని ప్రజలు అనుకుంటున్నారు.

అలాగే, ఈ వాహనాల వాడకంలో చంద్రబాబు ప్రభుత్వం కుటిల రాజకీయం చేసిందట. ఆ వాహనాల మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి పేరును, ఫోటోను తొలగించేసిందిట. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని అంత ఘోరంగా ఓడించిన తర్వాత కూడా ప్రభుత్వ వాహనాల మీద ఆయన ఫోటో ఉంటుందని, ఉండాలని జగన్ దళాలు ఎలా అనుకున్నాయో తెలియడం లేదు. జగన్ ఫోటో తీసేసినందుకు ఈ ఏడుపు ఏమిటో అసలు అర్థం కావడం లేదు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం మారినా.. పాత పాలకుల బొమ్మలు తీయించడం చాలా సాధారణం. అక్కడికేదో.. జగన్మోహన్ రెడ్డి తన జేబులోని సొమ్ముతో ప్రభుత్వానికి ఆ నిత్యావసర సరుకుల వాహనాలు దానం చేసినట్టుగా బిల్డప్ ఇస్తూ వాటిమీద జగన్ ఫోటో తొలగించడం తప్పని వారు నిందలు వేయడం చూసి జనం నవ్వుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories